చోరీ కేసులో ఒకరు అరెస్ట్

చోరీ కేసులో ఒకరు అరెస్ట్

CTR: SRపురం మండలం గంగమ్మ గుడి గ్రామానికి చెందిన చిట్టిబాబు నాయుడు ఇంట్లో ఆగస్టులో దొంగతనం జరిగింది. తలుపులు, బీరువాలు పగలగొట్టి దొంగతనం చేశారు. నిందితుడు తమిళనాడు రాష్ట్రం తిరవళ్లూరుకు చెందిన సుందర్ రాజుగా గుర్తించి అతడిని అరెస్ట్ చేశామని ఎస్ఆర్ పురం ఎస్సై సుమన్ తెలిపారు. నిందితుడి నుంచి రూ.5వేలు, ఓ బైకు స్వాధీనం చేసుకున్నారు.