VIDEO: పెండింగ్ చలానాల మీద పోలీసులు స్పెషల్ డ్రైవ్
AKP: నర్సీపట్నం శ్రీకన్య జంక్షన్‌లో శుక్రవారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. టౌన్ ఎస్సై ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీలలో పలువురు వాహనదారుల పెండింగ్‌లో ఉన్న చలానాలను వసూలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. పెండింగ్ చలానాల మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఒక్కరోజే 20 పెండింగ్ చలనాలు వసూలు చేసామని తెలిపారు.