ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే

గుంటూరు జేకేసీ కళాశాల రోడ్డులోని గల తాడికొండ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అందరి సమస్యలను విన్న తరువాత వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.