పంట పరిహారం.. 'మహా' ప్రభుత్వంపై మండిపాటు

పంట పరిహారం.. 'మహా' ప్రభుత్వంపై మండిపాటు

మహారాష్ట్రలో వరదల కారణంగా నష్టపోయిన రైతులకు రూ.10 కంటే తక్కువగా పరిహారం అందటం చర్చనీయాంశమైంది. దావర్వాడికి చెందిన సుధాకర్ అనే రైతు తనకు రూ.6 మాత్రమే పంట పరిహారం అందిందని వాపోయారు. ఈ సాయం టీ తాగడానికి కూడా సరిపోదని మండిపడ్డారు. తక్కువ పరిహారం అందిన రైతులంతా కలిసి కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాకు దిగారు. తమకు అందిన సాయాన్ని చెక్కుల రూపంలో తిరిగి ఇచ్చేశారు.