దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు: ఎమ్మెల్యే
BDK: రైతులు దళారులను నమ్మి మోసపోకుండా సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సాంబశివరావు తెలిపారు. పాల్వంచ మండలం సోములుగూడెం గ్రామంలో సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు ధాన్యం కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.