'ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలి'

'ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలి'

NDL: అనంతపురం ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని శ్రీశైలం జూనియర్ ఎన్టీఆర్ సేవా సమితి నాయకులు డిమాండ్ చేశారు. సున్నిపెంటలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తులతో శాంతియుతంగా నిరసన తెలిపారు. సేవా సమితి అధ్యక్షుడు సిరాజు మాట్లాడుతూ.. స్త్రీలను గౌరవించే టీడీపీలో ఉంటూ స్త్రీలను అగౌరపరిచిన ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలన్నారు.