పరిటాలలో కుళ్లిన మృతదేహం లభ్యం

పరిటాలలో కుళ్లిన మృతదేహం లభ్యం

కృష్ణా: కంచికచర్ల (మం) పరిటాల హైవేలో ఆంజనేయస్వామి గుడి సమీపంలో ముళ్ల పొదల్లో ఓ కుళ్లిన మృతదేహం గురువారం లభ్యమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించగా, హైదరాబాద్ కాప్రాకు చెందిన కొండయ్య (55)గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మార్చి 26న కుషాయిగూడలో మిస్సింగ్ కేసు నమోదు కాగా, భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.