ఉరివేసుకుని యువకుడు మృతి
PPM: ఆస్తి తగాదాల కారణంగా సాలూరులో ఓ యువకుడు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. గొల్లవీధికి చెందిన పెద్దపల్లి చంద్రశేఖర్ (22) కుటుంబంలో ఆస్తి వివాదాలు నెలకొన్న నేపథ్యంలో బుధవారం మామిడిపల్లి జంక్షన్ వద్ద ఉన్న తన నాన్నమ్మ ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు. అనంతరం అదే ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.