భార్యని సుత్తితో కొట్టి చంపిన భర్త

భార్యని సుత్తితో కొట్టి చంపిన భర్త

HYD: హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా భార్యని క్షణికావేశంలో భర్త సుత్తితో కొట్టి చంపేశాడు. పెయింట్ డబ్బా తల మీద పడిందని డ్రామా ఆడి యశోదా ఆస్పత్రికి తరలించాడు. అనుమానంతో తండ్రిపై కూతుర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.