BREAKING: టీమిండియా ఘన విజయం
మూడో T20లో సౌతాఫ్రికాపై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 118 పరుగుల లక్ష్యాన్ని భారత్ 15.5 ఓవర్లలోనే ఛేదించింది. గిల్‌తో కలిసి తొలి వికెట్‌కు 32 బంతుల్లో 60 పరుగులు జోడించి అభిషేక్(35) ఔటయ్యాడు. అనంతరం గిల్(28), సూర్య(8) కూడా పెవిలియన్ చేరారు. తిలక్(26), దూబే(10) కలిసి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. దీంతో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది.