మార్కాపురంలో రథోత్సవం.. ట్రాఫిక్ మార్పులు..!
మార్కాపురంలో లక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపు జరిగే రథోత్సవం దృష్ట్యా ట్రాఫిక్ మార్పులు అమల్లోకి వచ్చాయి. కంభం బస్టాండ్ నుంచి కంభం, దోర్నాల వైపు వెళ్లే బస్సులను తర్లుపాడు మార్గం, చెరువు కట్ట బైపాస్ ద్వారా మళ్లిస్తున్నారు. ప్రజలు ముందుగానే ప్రయాణ ప్రణాళికలు చేసుకుని పోలీసులకు సహకరించాలని సీఐ సూచించారు.