సబ్ డివిజన్ పరిధిలో 30 యాక్ట్ అమలు

సబ్ డివిజన్ పరిధిలో 30 యాక్ట్ అమలు

ప్రకాశం: ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని ఒంగోలు డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు డిఎస్పీ కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ సహకరించాలన్నారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు.