VIDEO: మహిషాసుర మర్దిని దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు
VZM: బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన రాజరాజేశ్వరీ దేవి ఆలయంలో అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిషాసుర మర్దిని దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు దూసి శ్రీధర్ శర్మ అమ్మవారిని మహిషాసుర మర్దిని దేవిగా దివ్యాలంకరణ గావించారు. అనంతరం భక్తులచే సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు.