ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు

అన్నమయ్య: ఓబులవారిపల్లి, పుల్లంపేట, చిట్వేల్ మండలాల పరిధిలో ఇవాళ ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు జరిగింది. సైంటిస్ట్ సందీప్ నాయక్, ఏడీఏ సుబ్రమణ్యం, ఏవో, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంటలకు కషాయాలు, జీవామృతం వంటివి వాడాలని, ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయాన్ని అలవాటు చేసుకోవాలని ఏడీఏ సుబ్రమణ్యం రైతులకు సూచించారు.