వాడపల్లి ఆలయ ట్రస్ట్ బోర్డ్ మెంబర్‌గా మల్లీశ్వరి

AKP: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబర్‌గా పాయకరావుపేట ఎంపీటీసీ మలిపెద్ది మల్లీశ్వరిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం నక్కపల్లి క్యాంపు కార్యాలయంలో ఆమె పేరును ప్రకటించారు. తనకు భగవంతుడి సేవ చేసుకునే అవకాశం కల్పించిన హోంమంత్రికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.