పిచ్చి మొక్కలతో సబ్ స్టేషన్.. చీకట్లో సిబ్బంది విధులు
NLG: శాలిగౌరారం (M) వల్లాల సబ్ స్టేషన్‌లో కంప చెట్లు, పిచ్చి మొక్కలు పెరగడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. పాములు, తేళ్లు సంచరిస్తుండటంతో రాత్రి వేళల్లో విధులు ప్రమాదకరంగా మారాయి. 8 యార్డ్ లైట్లలో 2 మాత్రమే వెలుగుతుండటంతో టార్చ్ లైట్ల సాయంతో పనిచేస్తున్నారు. అధికారులు తక్షణమే కంప చెట్లను తొలగించి, లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.