VIDEO: 'పీఎం కిసాన్ –అన్నదాత సుఖీభవ'లో పాల్గొన్న అధికారులు

కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్‌లో పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఇంఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఏపీఎస్ RTC ఛైర్మన్ నారాయణరావు శనివారం పింగళికి నివాళులర్పించారు. అనంతరం 'పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ' కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోడీ పెట్టుబడి సాయంగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారని వారు తెలిపారు. ఎరువులు, విత్తనాలు సబ్సిడీతో అందిస్తున్నట్టు వివరించారు.