VIDEO: రోడ్డు ప్రమాదం.. 2 మేకలు మృతి
KMM: సత్తుపల్లి నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ములకలపల్లి పాల్వంచ మధ్యలోని పూసుగూడెం వద్ద ప్రమాదవశాత్తు మేకల గుంపును ఢీ కొట్టిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. RTC బస్సు మేకల గుంపును ఢీకొట్టడంలో 2 మేకల మృతి చెందాయి. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.