'కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఆందోళన చేపడతాం'

'కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఆందోళన చేపడతాం'

JGL: గిరిజన బంజారాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఆందోళన చేపడుతామని గిరిజన సంఘం ధర్మపురి నియోజకవర్గ ఇంఛార్జ్ జీవన్ నాయక్ హెచ్చరించారు. పెగడపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్టీ జాబితా నుంచి గిరిజన బంజారాలను తొలగించాలని కొందరు కుట్రలు పన్నుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ఆయన హెచ్చరించారు. గిరిజన బంజారాలకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోమన్నారు.