పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పణ

కరీంనగర్: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా కరీంనగర్ లో అపర భద్రాద్రిగా పేరు గాంచిన ఇల్లందకుంట రామాలయానికి ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పక్షాన రాములోరికి మంగళవారం పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్,వేదపండితులు ముత్యాల శర్మ, ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు.