చండ్రగూడెం సొసైటీ త్రిసభ్య ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరణ

కృష్ణా: మైలవరం మండలం చండ్రగూడెం పీఏసీఎస్ త్రిసభ్య ఛైర్మన్‌గా మోర్ల వెంకట రోశాలు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కమిటీ సభ్యులుగా తిరుపతిరావు, నాగరాజులు కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు రాజకీయాలకు అతీతంగా సేవలు అందించాలని సూచించారు.