రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

MDK: తూప్రాన్ మండలం ఘనాపూర్ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాల్ (25) అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోతారంకు చెందిన విశాల్, తన స్నేహితుడు నందకిషోర్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన ఆటో రిక్షా వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో విశాల్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన నందకిషోర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.