పోలీస్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

పోలీస్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

GDWL: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషిని ఈ సందర్భంగా ఎస్పీ కొనియాడారు. ఆయన ఆశయాలు అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.