అయ్యప్ప స్వామి పడి పూజలో ఎమ్మెల్యే కుంభం
యాదాద్రి: గూడూరు బిర్లా ఓపెన్ మైండ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో శుక్రవారం రాత్రి శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవం శబరిమల తంత్రి పూజారి శశి నంబూరి వారి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి పడిని వెలిగించారు. ప్రసాద విచారణ చేశారు. ఈ కార్యక్రమంలో MLA కుంభ అనిల్ కుమార్ రెడ్డి, స్వాములు భక్తులు పాల్గొన్నారు.