ముమ్మరంగా పూడికి తీత పనులు

VZM: తెర్లాం మండలం సుందరాడ గ్రామంలో బుధవారం సర్పంచ్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో ముమ్మరంగా అన్ని కాలువలలో పూడుకలు తీయించారు. గ్రామ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజల సహకారంతో గ్రామాన్ని శుభ్రంగా ఉంచేందుకు చర్యలు కొనసాగిస్తామని సర్పంచ్ తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండడం వలన ఎటువంటి సీజనల్ వ్యాధులకు గురి కాకుండా ఉండవచ్చని ఆయన తెలిపారు.