పరగడుపున నెయ్యి ఎందుకు తీసుకుంటారు?
చాలా మంది సెలబ్రిటీలు పరగడుపున నెయ్యి తీసుకోవడం వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ జీర్ణక్రియను మెరుగుపరిచి, ఎసిడిటీని తగ్గిస్తుంది. ఇది పోషకాలను శరీరం గ్రహించేలా చేస్తూ, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే, రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే చాలామంది దీనిని అలవాటు చేసుకుంటున్నారు.