ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్
NGKL: నాగర్ కర్నూల్ తూడుకుర్తి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ మంగళవారం పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు వేగంగా పూర్తి చేసేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అధికారులందరూ క్షేత్రస్థాయిలో పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.