బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది: భట్టి

TG: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు. సెప్టెంబరులోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు చెప్పిందని అన్నారు. 'స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా ముందుకెళ్లాలో న్యాయనిపుణులతో కమిటీ వేస్తాం. ఈనెల 28లోపు నివేదిక ఇవ్వాలని కమిటీని కోరతాం. ఆ నివేదిక ఆధారంగా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటాం' అని వెల్లడించారు.