కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీ మృతి

కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీ మృతి

కడపలోని కేంద్ర కారాగారంలో ఉన్న జీవిత ఖైదీ గురువారం గుండెపోటుతో మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు కడప సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న సుంకిరెడ్డికి గుండెపోటు వచ్చింది. దీంతో కడప రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు నంద్యాల జిల్లా కోవెలకుంట్ల(M) భీమునిపాడుకు చెందిన వ్యక్తిగా అధికారులు వెల్లడించారు.