పాక్ మిలిటరీ పోస్ట్‌కు నిప్పు పెట్టిన తాలిబన్లు

పాక్ మిలిటరీ పోస్ట్‌కు నిప్పు పెట్టిన తాలిబన్లు

పాక్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. మారూఫ్ జిల్లాలో ఇరు దేశాల బలగాలు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. మరో వైపు మిలిటరీ పోస్టుకు తాలిబన్లు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఇద్దరు పాక్ సైనికులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాకుండా షోరాబాక్ ప్రాంతంలో ఉన్న పాక్ ఔట్ పోస్ట్‌ను ఆక్రమించిన తాలిబన్లు మిలిటరీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.