మన్నవరప్పాడులో శ్మశానానికి వెళ్లాలంటే తప్పని తిప్పలు

మన్నవరప్పాడులో శ్మశానానికి వెళ్లాలంటే తప్పని తిప్పలు

NLR: నెల్లూరు రూరల్ పరిధిలోని ఆమంచర్ల పంచాయతీ మన్నవరప్పాడు గ్రామంలో ఎవరైనా చనిపోతే శ్మశానానికి తీసుకుని వెళ్లాలంటే తిప్పలు తప్పడం లేదు. శ్మశానానికి వెళ్లే దారిని కొంతమంది ఆక్రమించి సాగు చేసుకుంటూ ఉండడంతో గ్రామంలో ఎవరైనా చనిపోతే పొలాల్లోనే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమణకు గురైన శ్మశాన దారిని పునరుద్ధరించాలని కోరుతున్నారు.