బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పాయం

ఖమ్మం: పినపాక మండలం ఉప్పాక గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దారా శంకరయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. బుధవారం వారి దశదిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. అండగా ఉంటామన్నారు.