'పులివెందులలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది'

'పులివెందులలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది'

NDL: బనగానపల్లె పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి శనివారం నాడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పులివెందులలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలీసుల కాళ్లు పట్టుకున్న వాళ్లు కనికరించలేదని ఆయన అన్నారు.