కదిరిలో వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం

సత్యసాయి: కదిరిలోని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను వైభవంగా నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు వ్రతం సామాగ్రి అందజేసి విశిష్టతను వివరించారు. అనంతరం స్వామి ప్రసాదం అందజేసి భక్తులను ఆశీర్వదించారు.