'నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి'

SRCL: గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు. సిరిసిల్లలోని SP కార్యాలయంలో గురువారం ప్రకటన విడుదల చేశారు. మండపాలు ప్రజా రవాణా, ఎమర్జెన్సీ వాహనాలకు ఇబ్బందులేకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యుత్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. మండపాల నిర్వాహకుల బాధ్యత వహించే ఫోన్ నెంబర్లు ఉంచాలన్నారు.