నెల్లూరు జిల్లా అల్లుడు కాబోతున్న ప్రముఖ సింగర్

NLR: ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్- హరిణి రెడ్డి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కాగా ఆయన ప్రేయసి హరిణీరెడ్డి నేపథ్యం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఆమెది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. నెల్లూరుకు చెందిన నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న విజయ్ కుమార్ కూతురు. కాగా, విజయ్ కుమార్ 1985లో సర్వేపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.