శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు పరిశీలించిన ఎస్పీ
NDL: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం పాతాళగంగ వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును శనివారం జిల్లా ఎస్పీ సునీల్ పరిశీలించారు. మెట్ల మార్గంలో భక్తులు జాగ్రత్తగా వెళ్లాలని, భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బోటు నిర్వాహకులు లైఫ్ జాకెట్లు కల్పించి భద్రతా ప్రమాణాలతోనే ప్రయాణం నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.