రిటైర్డ్ ఎంపీడీవోకు ఎమ్మెల్యే సన్మానం
SRD: కల్హేర్ మండలం ఎంపీడీవో రమేష్ బాబు దేశ్‌పాండే పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా ఇవాళ సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన పదవి విరమణ సభలో ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొని శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంకిత భావంతో చేపట్టిన సేవలు నిరంతరం గుర్తింపునిస్తాయన్నారు.