ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన కలెక్టర్

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన కలెక్టర్

NZB: వేల్పూర్‌లోని అంక్సాపూర్ గ్రామంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యం బస్తాలను గమనించి, రైస్ మిల్లులకు వెంటదివెంట తరలించాలని అధికారులకు సూచించారు. ధాన్యాన్ని రైతులు కేంద్రానికి తెచ్చిన వెంటనే తూకం వేయించి లారీలలో లోడ్ చేసి మిల్లలకు పంపాలన్నారు.