నెల్లూరు సౌత్ స్టేషన్‌లో గుర్తుతెలియని వృద్ధుడి మృతి
NLR: నెల్లూరు సౌత్ రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు 5.5 అడుగుల ఎత్తు ఉండి, బ్లూ చొక్కా, నల్ల పంచె ధరించి ఉన్నాడు. వయోభారంతో సహజ మరణం సంభవించి ఉండవచ్చని మృతదేహాన్ని పరిశీలించిన రైల్వే ఎస్సై హరిచందన తెలిపారు. ఈ మేరకు బుధవారం కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.