VIDEO: 'రైతులకు 'డిజిటల్' భరోసా తప్పనిసరి'
SRPT: పట్టాదారు పాస్ బుక్ ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని ఇవాళ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు, పెట్టుబడి సాయం నేరుగా రైతుల ఖాతాల్లోకి చేరడమే దీని ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల పంట బీమా, మద్దతు ధరలో పారదర్శకత పెరుగుతుంది. రైతులు వెంటనే AEOలను సంప్రదించాలన్నారు.