కంప్యూటర్ విజ్ఞానం తెలుసుకోవాలి

SKLM: ప్రాథమిక స్థాయి నుంచే కంప్యూటర్ గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని రిసోర్స్ పర్సన్ కొమ్మురు గోవిందరావు అన్నారు. వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా బుధవారం లావేరు శాఖా గ్రంథాలయములో విద్యార్థులకు కంప్యూటర్‌పై అవగాహన కల్పించారు. దాని పనితీరును వివరించారు. డేటా, సమాచారం, జ్ఞానం, సామాజిక ప్రభావాలు, పర్యావరణ గురించి తెలియజేశారు.