'శాస్త్రీయ సమాజం కోసం జన విజ్ఞాన వేదిక కృషి అభినందనీయం'
NLG: ఆదివారం చెకుముకి సైన్స్ సంబరాలు పోస్టర్‌ను మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశనుంచే విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో, ప్రతి సంవత్సరం చెకుముకి సైన్స్ సంబురాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. అలాగే మూఢనమ్మకాలు, ఆరోగ్య ఆహారపు అలవాట్ల అవగాహనపై కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.