టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారం

కర్నూల్: మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.రాఘవేంద్ర రెడ్డి గురువారం కౌతాళం మండల పరిధిలో గల తిప్పలదొడ్డి, కరిణి గ్రామాల్లో పర్యటించారు. వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నియోజకవర్గంలోని చిన్న చిన్న గ్రామాల్లో గొడవలు సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం తప్ప డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదని ఎన్.రాఘవేంద్ర రెడ్డి మండిపడ్డారు.