కడపలో పర్యటించిన రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి

కడపలో పర్యటించిన రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి

కడపలోని 40, 48వ డివిజన్లలో టీడీపీ నేత రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు కార్పొరేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రధానంగా మురుగు నీరు నిలిచిపోతున్న పరిస్థితిని గమనించి, అక్కడ నూతన కల్వర్టు నిర్మాణం అవసరమని నిర్ణయించారు. ప్రజలకు శాశ్వత పరిష్కారం లభించేలా వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.