VIDEO: అమ్మాజీ ఆలయంలోకి ఎలుగుబంటి ప్రవేశం
సత్యసాయి: రొళ్ల మండలం జీరిగేపల్లిలోని అమ్మాజీ ఆలయంలోకి శుక్రవారం సాయంత్రం ఎలుగుబంటి ప్రవేశించిన ఘటన వైరల్ అవుతోంది. ఆలయంలో ఉన్న సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. అది ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆలయం లోపల తిరుగుతుండగా సెన్సార్ సైరన్ మోగడంతో భయపడి వెంటనే బయటకు వెళ్లిపోయింది. గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది.