మాజీ ZPTCకి 23 ఓట్లు
SDPT: బెజ్జంకి మండల జడ్పీటీసీగా బాధ్యతలు నిర్వహించిన కనగండ్ల కవిత తిరుపతి ఈ నెల 14న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో దాచారం గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసి కేవలం 23 ఓట్లు మాత్రమే సాధించడం మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జడ్పీటీసీగా పనిచేసిన ఆమె పోటీలో చివరి వరుసలో నిలవడం పట్ల గ్రామస్తుల్లో విస్తృత చర్చ జరుగుతోంది.