VIDEO: ఇళ్ల పట్టాలు ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన

VIDEO: ఇళ్ల పట్టాలు ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన

ATP: కనేకల్ మండలంలో ఇంటి స్థలాలు లేని నిరుపేదలందరికీ ఇంటి పట్టాలు తక్షణమే మంజూరు చేయాలని సీపీఐ తాలూకా కార్యదర్శి నాగార్జున డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు తమ ప్రభుత్వం రాగానే ఇంటి స్థలాలు లేని ప్రతిఒక్కరికి ఇంటి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడ్డాక మర్చిపోయారన్నారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు.