'హర్ ఘర్ తిరంగా' ప్రారంభం

NTR: విజయవాడ రైల్వే డివిజన్‌లో 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమాన్ని డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా గురువారం ప్రారంభించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రైల్వే ఉద్యోగులు, ప్రయాణికులకు జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. దేశభక్తి బలపడేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని తెలిపారు. ప్రజలు తమ ఇళ్లపై జెండాలు ఎగురవేయాలని, డీపీలు మార్చుకోవాలని సూచించారు.