'పంచాయతీరాజ్ రోడ్లకు నిధులు విడుదల చేస్తాం'
KNR: మానకొండూర్ నియోజకవర్గం పరిధిలో చేపట్టిన పంచాయతీ రాజ్ రోడ్లకు సత్వరమే నిధులు విడుదల చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క చెప్పారు. బుధవారం మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నేతృత్వంలో ఆరు మండలాలకు చెందిన సర్పంచులు, పార్టీ నాయకులు అసెంబ్లీలోని చాంబర్‌లో వినతిపత్రం అందజేయగా ఈ మేరకు ఆమె వారికి హామీ ఇచ్చారు.